అణు విద్యుత్
అణు విద్యుత్ లేదా అణు శక్తి అనగా ఒక పదార్థం యొక్క అణువుల కేంద్రకాలను పట్టి ఉంచే ఒక శక్తి. అణువులు అంటే పదార్థాన్ని విడగొడుతూ పోతే చివరికి మిగిలే అతి సూక్ష్మమైన కణాలు. ప్రతి అణువుకు ఒక కేంద్రం ఉంటుంది. వీటిలోనే అణుశక్తి దాగి ఉంటుంది. కొన్ని రేడియో ధార్మిక పదార్థాలకు సంబంధించిన కొన్ని అణువులు ఈ శక్తినంతటినీ దాచుకోకుండా కొంత భాగాన్ని రేడియేషన్ రూపంలో బయటకు వెదజల్లుతూ ఉంటాయి. [1]
ఈ అణుశక్తిని వెలికితీయడానికి ప్రధానంగా రెండు పద్దతులున్నాయి. ఒకటి కేంద్రక విచ్ఛిత్తి మరొకటి కేంద్రక సంలీనం. కేంద్రక విచ్ఛిత్తి అంటే ఒక అణువును రెండుగా విడగొట్టడం. కేంద్రక సంలీనం అంటే రెండు అణువులను కలిపి ఒక అణువును తయారు చేయడం. ఈ రెండు పద్దతుల్లోనూ అపారమైన శక్తి విడుదలౌతుంది. ఈ ప్రక్రియ ప్రకృతి సిద్ధంగా కూడా జరుగుతుంది. ఉదాహరణకు సూర్యుడి నుంచి వేడిమి పుట్టడానికి కేంద్రక సంలీనమే కారణం. అణు విద్యు��్కేంద్రాలలో కేంద్రక విచ్చిత్తిని ఉపయోగించి విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ రెండూ ప్రక్రియలను అణ్వాయుధాల తయారీలో కూడా వాడతారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- కేంద్రక విచ్ఛిత్తి - అణువు యొక్క కేంద్రకాన్ని చిన్న భాగాలుగా విడగొట్టే ప్రక్రియ ద్వారా అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల ఒక పద్ధతి
- కేంద్రక సంలీనం - రెండు పరమాణువుల యొక్క కేంద్రకాలను ఒకే ఒక కేంద్రంగా కలిపే ప్రక్రియ ద్వారా అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల ఒక పద్ధతి
- అణు రియాక్టరు - కేంద్రక విచ్ఛిత్తి లేదా కేంద్రక సంలీనం పద్ధతుల ద్వారా అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పరికరము
- ద ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ - అణు విద్యుత్‌ను తయారు చేసేందుకు ఫ్రాన్స్ లో నిర్మించతలపెట్టిన అతిపెద్ద కేంద్రక సంలీన అణు రియాక్టరు.
మూలాలు
[మార్చు]- ↑ "Nuclear Energy". Energy Education is an interactive curriculum supplement for secondary-school science students, funded by the U. S. Department of Energy and the Texas State Energy Conservation Office (SECO). U. S. Department of Energy and the Texas State Energy Conservation Office (SECO). July 2010. Archived from the original on 2011-02-26. Retrieved 2010-07-10.